ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం విధితమే. తాజాగా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఇవాళ చంద్రబాబును దాదాపు 7 గంటల పాటు విచారణ చేపట్టారు సీఐడీ అధికారులు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్ట్ పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో క్విడ్ ప్రోకోలో అధికారులను బాధ్యులు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద కేసు ఎందుకు పెట్టలేదు అని ప్రశ్నించారు.
ఇప్పుడు అధికారులను వదిలేసి.. చంద్రబాబు మీద అక్రమంగా కేసులు పెట్టారని పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అధికారులను ఎందుకు ప్రశ్నించడం లేదు..? సీఎం జగన్ ఈ నిర్ణయంతో, ఆయన సమాధికి ఆయనే గొయ్యి తవ్వుకున్నాడు. అసెంబ్లీలో అజ్జైన్మెంట్ మోషన్ పై చదవటానికి కూడా స్పీకర్ ఇష్టపడడం లేదు. ఎక్కువ మంది బలం ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు ..అసెంబ్లీ కళ్ళు చెవులు లేని, కపోదీ తయారు చేశారు. సోమవారం నుంచి అసెంబ్లీకి టీడీపీ హాజరు కావడం లేదు.. బహిష్కరిస్తుందని తెలిపారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ పనితీరు బాగుందని జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీతో సహా పలువురు రిపోర్టులను సమర్పించారు. ఈరోజు అన్యాయం, గెలవచ్చు.. రేపు అన్న రోజు నాడు కచ్చితంగా న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు గంటా.