శుక్రవారం టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పుంగనూరు పర్యటనలో టిడిపి, వైసిపి కార్యకర్తలు పరస్పర గొడవకు దిగారు. ఇరు వర్గాలు రాళ్లు విసురుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వర్గాలపై లాటీ ఛార్జ్ చేసి చెదరగొట్టారు. ఆందోళనకారులను చదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు టిడిపి కార్యకర్తలకు గాయాలయ్యాయి.
ఈ నేపథ్యంలో చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిని ఖండిస్తూ శనివారం నిరసన తెలిపేందుకు నాగసముద్రం గేట్ కి వెళుతుండగా టిడిపి నాయకురాలు, మాజీ మంత్రి పరిటాల సునితను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ మరూర్ టోల్ గేట్ వద్ద పరిటాల సునీత ఆందోళనకు దిగారు. చంద్రబాబు పర్యటనలో పోలీసులే టిడిపి నేతలపై రాళ్లదాడి చేశారని ఆమె ఆరోపించారు. ఇక నిరసన కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారని టిడిపి నాయకులందరినీ రాప్తాడు పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు.