డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఊహించిన పరిణామం ఎదురైంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్యాంప్ ఆఫీస్ ఎదుట ఓ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే రాజమండ్రిలో వైసీపీ మహిళా కార్పొరేటర్ బాధితులకు చెందిన 1200 గజాల భూమిని కబ్జా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.
గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోతూ వారు ఈ ఘటనకు పాల్పడ్డారు. పవన్ తమకు న్యాయం చేయాలని కోరారు. ఇది ఇలా ఉండగా జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈనెల 26న వారాహి అమ్మ వారి దీక్ష చేపట్టనున్నారు. 26 నుంచి 11 రోజులపాటు పవన్ ఈ దీక్ష పాటించనున్నారు. ఈ దీక్షలో భాగంగా పాలు, పండ్లు, ద్రవ ఆహారం మాత్రమే తీసుకుంటారు. కాగా, 2023 జూన్ లో పవన్ కల్యాణ్…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వారాహి యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ యాత్ర సందర్భంగా పవన్ వారాహి అమ్మ వారికి పూజలు చేసి…ఆ తర్వాత దీక్షకు దిగనున్నారు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.