బాలయ్య అభిమానుల సంఘం పేరుతో సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగ్

-

తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే హీరో నందమూరి బాలకృష్ణ కు ఊహించని షాక్‌ తగిలింది. తాజాగా నంద్యాలలో సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగ్ కలకలం రేపింది. తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యే హీరో నందమూరి బాలకృష్ణ అభిమానుల సంఘం పేరిట సోషల్ మీడియాలో ఫేక్ పోస్టింగ్ కలకలం సృష్టించింది. చలో రాజమహేంద్రవరం నిర్వహించి చంద్రబాబు నిర్బంధించిన జైలు వద్ద చేయాలని ధర్నా, రాస్తారోకో చేయాలని ఫేక్ పోస్టింగ్ లో పిలుపు ఇచ్చారు.

Fake posting on social media in the name of Balayya fans association
Fake posting on social media in the name of Balayya fans association

అది నమ్మి మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్ సహా 6 మంది బాలయ్య అభిమానులను అదుపులోకి తీసుకున్నారు నంద్యాల పోలీసులు. నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పి.ఎస్. లో మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్ సహా 6 మంది బాలయ్య అభిమానులను నిర్బంధించారు నంద్యాల పోలీసులు. అయితే.. చివరకు సోషల్ మీడియాలో వచ్చింది ఫేక్ పోస్టింగ్ అని నిర్ధారించింది ఇంటెలిజెన్స్ సిబ్బంది. ఈ తరుణంలోనే… అదుపులో ఉన్న మాజీ కౌన్సిలర్ శివశంకర్ యాదవ్ సహా 6 మంది బాలయ్య అభిమానులను అర్ధరాత్రి విడుదల చేశారు నంద్యాల పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news