నటుడు అలీ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్… పోలీసులకు ఫిర్యాదు…!

-

ఈ మధ్య రాజకీయ, సినీ రంగానికి చెందిన ప్రముఖుల పేర్లతో నకిలీ అకౌంట్లను సోషల్ మీడియాలో ఓపెన్ చేసి ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. కొందరికైతే మరి దారుణంగా వారికి సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్ లేకపోయినా వారి పేరుతో అకౌంట్లను ఓపెన్ చేసి ప్రభుత్వాన్ని తిట్టి పోస్తున్నారు. దీంతో సెలబ్రిటీలకు ఇలాంటి వారితో కొత్త తలనొప్పులు వచ్చి పడుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇదివరకే ప్రముఖ నటుడు రావు రమేష్ ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందించిన విషయం తెలిసిందే.

ali

ఇక తాజాగా ప్రముఖ కమెడియన్ అలీ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అలీ తన పేరు మీద ట్విట్టర్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశారని, ఆ విషయం పై పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలియజేశారు. నేడు ఆయన సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని కలిసి ఫిర్యాదు అందించారు. తన పేరు పై ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలని అలీ కోరారు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. వీలైనంత తొందరగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version