ఏపీలోని ఇసుక విధానంపై తప్పుడు ప్రచారంపై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. రవాణా ఖర్చులతో కలిపిన వ్యయాన్ని చూపుతూ ఇసుక ధరలపై అసత్య ప్రచారమని…తూర్పు గోదావరి జిల్లాలో గతంతో పోల్చితే మెట్రిక్ టన్నుకు రూ.260 తగ్గింపుకే ఇసుక అని తెలిపారు. ఉచిత ఇసుకు విధానం అమలుకు చిత్తశుద్దితో ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. తూర్పుగోదావరిలోని డి-సిల్టేషన్ సప్లై పాయింట్ నుండి పనసపాడు 60 కి.మీ దూరంకు వినియోగదారునికి 20 మెట్రిక్ టన్నుల రవాణా ఖర్చు రూ 9,276తో కలిపి, మొత్తం ₹16,640 ఫిక్స్ చేసినట్లు వివరించారు.
నిజానికి రవాణా ఖర్చులు రూ. 9,276 తీసివేసిన తర్వాత, మొత్తం నిర్వహణ వ్యయం, చట్టబద్ధమైన పన్నులు, జిఎస్టి ఇసుక కోసం వ్యయం చేసింది కేవలం మెట్రిక్ టన్నుకు రూ. 366 మాత్రమేనన్నారు. ఇదే కేంద్రం వద్ద మెట్రిక్ టన్నుకు గతంలో రూ.625 వసూలు చేయగా, ప్రస్తుతం రూ. 260 తగ్గించి ప్రజలకు చౌకగా ఇసుక అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అదనపు ఖర్చులు వసూలు చేయటం లేదు, రవాణా ధరలు రాష్ట్రమంతటా ఏకరీతిగా నిర్ణయమని… ప్రస్తుతం సిఎం అదేశాల మేరకు గనుల శాఖ రవాణా ఖర్చులతో సహా వర్తించే అన్ని ఛార్జీల యొక్క ఖచ్చితమైన వాస్తవ రసీదుని వినియోగదారులకు అందిస్తోందని తెలిపారు. ప్రజలకు సాధ్యమైనంత తక్కువ ధరలకు ఇసుకను సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని పేర్కొన్నారు ముఖేష్ కుమార్ మీనా.