విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలో రైతులు ఆందోళన బాట పట్టారు. బైపాస్ రహదారి పక్కన తమ పొలాలలో లాంకో కంపెనీ వేస్తున్న కవర్ల నిర్మాణాన్ని అడ్డుకున్నారు రైతులు. తమ అనుమతి లేకుండా పొలాల్లో టవర్ల నిర్మాణం చేపట్టటం సరికాదంటూ రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు బందోబస్తు నడుమ టవర్ల నిర్మాణం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు రైతులు.
అయితే 50 మంది రైతులకు లాంకో కంపెనీ చేపడుతున్న టవర్ల నిర్మాణం కారణంగా నష్టం వాటిల్లుతుందని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వేసిన టవర్ల కోసం గతంలో స్థలాలు ఇచ్చామని, మరలా కొత్త టవర్ల నిర్మాణాలు ఎందుకని అధికారులను ప్రశ్నిస్తున్నారు రైతులు. గతంలో ఇచ్చిన పాత అలైన్మెంట్ టవర్లను ఉపయోగించుకోవాలని, నూతన టవర్ల నిర్మాణాలు ఆపాలని డిమాండ్ చేస్తునారు. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అయితే సమస్య పరిష్కారానికి రైతులతో చర్చిస్తున్నారు విజయవాడ సబ్ కలెక్టర్ చైతన్య.