ఏపీలో దారుణం జరిగింది. ఓ ప్రేమజంటపై తండ్రి కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం లో ప్రేమ పెళ్ళి చేసుకున్న జంటపై అమ్మాయి తండ్రి దాడి చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా కొడేరు లంకకు చెందిన రమేష్ ,పి. గన్నవరం మండలం L. గన్నవరం కు చెందిన కొప్పాడి వరాలు ప్రేమ పెళ్ళి చేసుకుని పోలీసులను ఆశ్రయించింది జంట. ఇద్దరికి మైనారిటీ తీరడంతో ఇద్దరు పెద్దలకు చెప్పి అబ్బాయి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.
రాత్రి అమ్మాయి తండ్రి వెంకటరమణ పశ్చిమ గోదావరి జిల్లా కొడేరులంక అబ్బాయి ఇంటికి వెళ్ళి పెళ్ళి కొడుకు,పెళ్ళి కూతురి తోపాటు కుటుంబ సభ్యులపై దాడి జరిగింది. కూడా తెచ్చుకున్న కత్తి తో దాడి చేశాడు అమ్మాయి తండ్రి. ఇక ఈ దాడిలో పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకు, పెళ్ళి కొడుకు తల్లి, చెల్లికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారందరూ పి.గన్నరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..