ప్రేమికుల దినోత్సవం రోజునే ప్రేమోన్మాది అమానుషానికి ఒడిగట్టాడు. ప్రేమ పేరుతో వేధించి యువతి పై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ప్రేమోన్మాది. వివరాల్లోకి వెళ్లితే.. అన్నమయ్య జిల్లాలోని గుర్రంకొండ మండలంలోని ప్యారంపల్లె కు చెందిన గౌతమి (23) పై ప్రేమోన్మాది గణేష్ యాసిడ్ తో దాడి చేశాడు. దీంతో బాధితురాలు విలవిల్లాడిపోయింది. ఈ తరుణంలోనే వెంటనే ఆమెను మదనపల్లెలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే గౌతమికి పెళ్లి నిశ్చయం అయింది.
అయితే ఈ దాడి ఘటనను మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితురాలుకి అండగా ఉండాలని.. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ట్విట్టర్ వేదికగా ఖండించారు జగన్. ఇకనైనా మహిళల భద్రత పై దృష్టి సారించండి అని కోరారు.