ఏపీలో విషాదం…స్కూల్లో ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి

-

ఏపీలో విషాదం జరిగింది. స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగి ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ ఎంకే బేగ్ హై స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి భోజనం చేసిన తరువాత 10 మంది పిల్లలకు వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

Food poisoning in vijayawada school One died

డిశ్చార్జ్ అయిన అనంతరం కరిష్మా అనే విద్యార్థిని మృతి చెందింది. ఈ క్రమంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విద్యార్థులను తిరిగి మళ్ళీ ఆసుపత్రికి తరలించారు. కలుషిత ఆహారమే ఇందుకు కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news