చంద్రబాబును కలవడంపై తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ సంచలన ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ భేటీ అయ్యారు. సుమారు రెండు గంటల పాటు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఇక ఈ సమావేశం అనంతరం చంద్రబాబును కలవడంపై తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ సంచలన ప్రకటన చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు ను మర్యాదపూర్వకంగా కలిసాను…తెలంగాణ, ఏపీ అంశాలపై చర్చ ఏమీ జరగలేదని వివరించారు. చంద్రబాబు అభివృద్ధిపై అవగాహన ఉన్న వ్యక్తి అని… ప్రత్యేకంగా ఎటువంటి అంశాలూ మా మధ్య చర్చకు రాలేదని తెలిపారు. విభజన అంశాలపై ఎటువంటి చర్చ జరగలేదు… అమ్మవారి దర్శనం చాలా అద్భుతంగా జరిగిందని పేర్కొన్నారు. అమ్మవారిని దర్శించుకుందామనే విజయవాడ వచ్చాను అన్నారు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్.
అనంతరం విజయవాడ అమ్మవారి దగ్గరకు వెళ్లారు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. ఇక ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో తెలంగాణ గవర్నర్ కు స్వాగతం పలికారు అధికారులు. అటు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ వేద పండితులు… అమ్మవారి దర్శనానంతరం తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కు వేదాశీర్వచనం చేశారు.