బిజెపి మాజీ ఎమ్మెల్సీ కన్నుమూత

-

ఆంధ్రప్రదేశ్ బిజెపి మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీ చలపతిరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని పికినాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు ప్రాణాలు విడిచారు. ప్రస్తుత బిజెపి ఎమ్మెల్సీ నేత పివిఎన్ మాధవ్ తండ్రి చలపతిరావు. కాసేపట్లో ఆసుపత్రి నుంచి పీవీ చలపతి రావు ఇంటికి పార్తివదేహాన్ని తరలించనున్నారు.

కార్మిక సంఘం నాయకుడిగా, విశాఖ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గం ఎమ్మెల్సీగా చలపతిరావు పనిచేశారు. జన్ సంఘ్ పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖులలో చలపతిరావు ఒకరు. కాంగ్రెస్ పార్టీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చలపతిరావు చేసిన పోరాటం నేటి తరానికి ఆదర్శం.

Read more RELATED
Recommended to you

Latest news