సంక్రాంతి కానుకగా హీట్ -2 ఓటిటి రిలీజ్..!!

-

టాలీవుడ్ లో యంగ్ హీరో గా, పాన్ ఇండియా హీరోగా పేరుపొందిన అడవి శేషు ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా తనకు అచ్చు వచ్చిన థ్రిల్లర్ జోనర్లో ఎన్నో చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాడు.ఈ ఏడాది మొదట్లో మేజర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకొని పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు. డిసెంబర్-2 వ తేదీన హీట్ -2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. నాని ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం జరిగింది.

ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెంట్ సాధించి మంచి లాభాల బాట పట్టింది ఈ చిత్రం. ఈ సినిమా థియేటర్లలో ఫుల్ కలెక్షన్లు నడుస్తున్న క్రమంలోని డిజిటల్ రిలీజ్ కోసం ఓటిటి ప్రియులు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓటిటి అభిమానుల కోసం సంక్రాంతి కానుకగా ఈ సినిమాని జనవరి 13వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ అయినా డిస్నీ ప్లస్ హాట్ స్టార్.. అమెజాన్ ప్రైమ్ పోటీ పడగా ఈ సినిమాని అమెజాన్ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం.

త్వరలోనే ఈ సినిమా పైన అధికారికంగా ప్రకటన వెలుబడబోతోంది. సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా హీట్ -3 కూడా రాబోతున్నట్లు ఈ సినిమా చివరలో చూపించారు. ఇందులో నాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అలాగే అడవి శేషు కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఒక ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news