చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైసీపీ మాజీ ఎంపీ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి వచ్చారు ఎంపీ మిథున్ రెడ్డి. ఈ తరుణంఓనే…. మాజీ ఎంపీ.రెడ్డెప్ప ఇంటిని చుట్టుముట్టారు టిడిపి పార్టీ నేతలు.
అటు వైసీపీ నేతలు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు. దీంతో పరస్పరం రాళ్ళ దాడి చేసుకుంటున్నారు ఇరు వర్గాల నేతలు. కొంత మంది నేతలు చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిపై రాళ్ల దాడి కూడా చేశారు. ఈ సంఘటన నేపథ్యలో పుంగనూరులో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.