భద్రాచలం వద్ద గోదావరిలో 21 అడుగులకు చేరిన నీటిమట్టం

-

తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో భద్రాచలంలోని గోదావరి నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. ఈరోజు ఉదయానికి గోదావరి నీటి మట్టం 21 అడుగులకు చేరింది. ఎగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్టు నుంచి వరద నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గోదావరిలో నీటిమట్టం పెరుగుతూ వస్తోంది.

దుమ్ముగూడెం మండలంలోని సీత వాగుతో పాటు, గుబ్బల మంగి వాగులు, ఉద్ధృతంగా ప్రవహిస్తూ నదిలో కలుస్తున్నాయి. మరోవైపు భద్రాచలం నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చర్ల, దుమ్ముగూడెం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి పైకి మురుగునీరు చేరడంతో వాహనదారులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు  తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ప్రధాన రహదారి పైకి మురుగునీరు చేరుతోందని స్థానికులు వాపోతున్నారు. ప్రధాన రహదారిపైకి 3 అడుగుల మేర నీరు చేరడంతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. వర్షం వల్ల సత్తుపల్లి జేవీఆర్, కిష్టారం గనుల్లో 15 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

Read more RELATED
Recommended to you

Latest news