కమ్మ సామాజిక వర్గానికి మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్షమాపణలు

-

బాపట్ల: వైసిపి సీనియర్ నేత ఆమంచి కృష్ణమోహన్ కమ్మ కులాన్ని టార్గెట్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ కులస్తులు ఆమంచి పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కమ్మ సామాజిక వర్గంపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేశారు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.

ఆయన మాట్లాడుతూ.. వేటపాలెం ఘటనలో తాను చేసిన వ్యాఖ్యలు కమ్మ సామాజిక వర్గంలోని కొందరు కుల రహితంగా బ్రతికే వారికి, నా శ్రేయోభిలాషులకు, స్నేహితులకు బాధించాయని.. ఈ నేపథ్యంలో అందరికీ మనస్పూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని అన్నారు. తాను చేసిన ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానన్నారు. ఆరోజు ఆ ఘటనకు కారణమైన వ్యక్తులకు మాత్రం తన క్షమాపణలు వర్తించవన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version