ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఏపీలోనే తొలిసారి విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు జనవరి 15న ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది. తొలి విడతలో రూ. 9,699 కోట్ల వ్యయంతో 76 కి.మీ లైట్ మెట్రో నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. తోలుతా 42 స్టేషన్లతో 3 కారిడార్లను ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర చరిత్ర, సాంస్కృతి ప్రతిబింబించేల పిల్లర్ల నిర్మాణం జరగనుంది. ఇందుకు వీలుగా నిధుల సమీకరణ వేగవంతం చేయాలని మెట్రో రైల్ కార్పొరేషన్ ను ప్రభుత్వము ఆదేశించింది.
కాగా, రేపు వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం వైఎస్ జగన్. ఇందులో భాగంగానే.. రేపు ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు సీఎం వైఎస్ జగన్. విద్యాధరపురం స్టేడియం గ్రౌండ్‌లో వైఎస్సార్ వాహన మిత్ర పథకం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమం జరుగనుంది. ఇక ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం కూడా ఉంటుంది. అనంతరం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు సీఎం జగన్.