విశాఖలో అరాచక పాలన నుంచి విముక్తి.. గంటా సంచలన వ్యాఖ్యలు

-

విశాఖ పట్టణ ప్రజలకు అరాచక పాలన నుంచి విముక్తి లభించిందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై పెట్టిన అవిశ్వాస తీర్మాణం నెగ్గింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు కొందరూ పార్టీకి రాజీనామా చేసి.. కూటమి నేతలతో జత కట్టారు. దీంతో జీవీఎంసీ మేయర్ పీటం కూటమి ప్రభుత్వం చేతుల్లోకి వచ్చింది.

దీనిపై గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదిక గా స్పందిస్తూ.. వైసీపీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మేయర్ పై అవిశ్వాస తీర్మాణం నెగ్గడంతో నాలుగేళ్ల వైసీపీ అవినీతి, అరాచక పాలన నుంచి విశాఖకు విముక్తి లభించిందని పేర్కొన్నారు. అధికార మదంతో జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ సాగించిన దౌర్జన్యాన్ని, దారుణాలను ప్రజలు ఎవ్వరూ మరిచిపోలేదని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పూర్తితో నగరాన్ని అభివృద్ధి బాట పట్టిస్తామన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news