ఉద్యోగులకు బిగ్ షాక్.. జిపిఎస్ ఖాతాల నుంచి రూ. 800 కోట్లు మాయం చేసిన జగన్ సర్కార్ !

-

ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి భారీ ఎత్తున నగదును విత్ డ్రా చేసింది ఏపీ ప్రభుత్వం. 90 వేల మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి రూ. 800 కోట్ల మేర ప్రభుత్వం డ్రా చేసినట్టు ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు విత్ డ్రా చేయడాన్ని తప్పు పడుతూ క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ స్పష్టం చేశాయి. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు డ్రా అయిపోతున్నాయని.. గతంలో ఇదే తరహాలో డబ్బులు డ్రా అయిపోతే.. కేసు నమోదు చేస్తామని చెబితే.. తిరిగి డబ్బులు జమ చేశారని ఫైర్ అయ్యారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయ

జీపీఎఫ్ స్లిప్పులను డౌన్ లోడ్ చేసుకుని చూస్తే డబ్బులు విత్ డ్రా అయినట్టు వెలుగులోకి వచ్చింది… నా ఖాతా నుంచే రూ. 80 వేల మేర డ్రా అయింది… నా ఒక్కడికే కాదు.. రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులను ప్రభుత్వం డ్రా చేసేసిందని మండిపడ్డారు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ. గతంలో జమ చేసిన డీఏ బకాయిలను తిరిగి ప్రభుత్వం తీసేసుకుంది… రూ. 800 కోట్లను 90 వేల మంది ఉద్యోగుల నుంచి ప్రభుత్వం డ్రా చేసేసిందన్నారు.

రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిల కోసం ప్రభుత్వం కాళ్లు పట్టుకోవడం ఒక్కటే తక్కువైంది… రిటైర్మెెట్ బెనిఫిట్స్ బకాయిలు ఇవ్వమని ప్రభుత్వాన్ని అడిగితే డీఏ బకాయిలను కూడా ప్రభుత్వం డ్రా చేసేసింది… నా అనుమతి లేకుండా నా ఖాతా నుంచి డబ్బులు విత్ డ్రా చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడిది..? అని నిలదీశారు. ప్రభుత్వం చేసేది తప్పు కాదు.. నేరం… మా జీపీఎఫ్ డబ్బులను తీసుకున్న ప్రభుత్వంపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news