తన రాజీనామా ఆమోదంపై హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. మూడేళ్ల కింద చేసిన రాజీనామాను స్పీకర్ తమ్మినేని ఇప్పుడు ఆమోదించడంపై అభ్యంతరం తెలిపారు. రాజీనామా ఆమోదంలో ప్రొసీజర్ ఫాలో కాలేదంటూ పిటిషన్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ తమ్మినేని తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. గంటా శ్రీనివాస్ వేసిన పిటిషన్ ఈ నెల 29న విచారణకు రానుంది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగు దేశం పార్టీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం ఆమోదించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2022 ఫిబ్రవరిలో గంటా శ్రీనివాస్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు రాజీనామాను పెండింగ్‌లో పెట్టిన స్పీకర్ తమ్మినేని తీరా ఎన్నికల ముందు రాజీనామాకు ఆమోదం తెలపడంపై ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.