నేడు, రేపు విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌

-

నేడు, రేపు విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 జరుగనుంది. ఈ నేపథ్యంలోనే గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సుకు ఏయూ గ్రౌండ్స్‌ సిద్ధమైంది. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 కోసం అద్భుతంగా ఏర్పాట్లు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఈ తరుణంలోనే ఉదయం 10 గంటలకు సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు సీఎం వైఎస్‌ జగన్‌.

ఇక విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వర్టర్ సమ్మిట్ 2023 ద్వారా ఏపీకి భారీగా పెట్టుబడునున్నాయి. ఇది ఇలా ఉండగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2023 లో భాగంగా విశాఖకు వచ్చే ఇన్వెస్టర్ల కోసం ప్రత్యేక వంటకాలను ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా ఆంధ్ర వంటకాలు అయిన రాగిసంకటి, నెల్లూరు చేపల పులుసు ఇలా అనేక రకాల వంటకాలను ఏర్పాటు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news