విశాఖలో త్వరలోనే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు: సీఎం జగన్

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేలా విశాఖపట్నంలో త్వరలో ఆంధ్రప్రదేశ్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు నిర్వహణకు సమాయత్తమవుతున్నామని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు చెప్పారు. పరిశ్రమల శాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ… పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని… ఎంఎస్‌ఎంఈల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

cm jagan
cm jagan

ఏటా క్రమం తప్పకుండా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని.. ఇండస్ట్రియల్‌ పార్కుల్లో కాలుష్య నివారణ… పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థలను పరిశీలించాలని తెలిపారు.ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగిన స్థాయిలో ఉన్నాయా? లేవా? చూడాలని.. పారిశ్రామిక వాడల్లో కాలుష్య నివారణ వ్యవస్థల బలోపేతానికి ప్రత్యేక నిధి అని పేర్కొన్నారు. సంబంధిత యూనిట్లకు ప్రభుత్వం నుంచి కొంత సహాయం చేసే రీతిలో విధానాన్ని తీసుకురావాలని తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news