మినీ అంగన్వాడీలకు శుభవార్త అందజేసింది కూటమి ప్రభుత్వం. ఏపీలో 4687 మినీ అంగన్వాడి కార్యకర్తలకు పదోన్నతులు కల్పించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన 4687 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలను అంగన్వాడీ కార్యకర్తలుగా అప్గ్రేడ్ చేశారు. కాగా, వీరి గౌరవ వేతనం నెలకు రూ. 11,500గా నిర్ణయించారు. 340 మినీ అంగన్వాడి కేంద్రాలను సమీపంలోని మెయిన్ అంగన్వాడి కేంద్రాలలో విలీనం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

దీంతో అంగన్వాడీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల మంచి పనులను చేస్తున్నారు. ఈ మధ్యనే గత నాలుగు రోజుల క్రితం స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ పథకం ద్వారా మహిళలు ఎలాంటి చార్జీలు లేకుండా బస్సులలో ప్రయాణం చేయవచ్చు. కాగా కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్త్రీ శక్తి పథకానికి మంచి రెస్పాన్స్ వస్తుందని ఏపీ మహిళలు అంటున్నారు. ఈ పథకం ద్వారా చాలామంది మహిళలు ఉచితంగా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారని ఏపీ మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.