మహారాష్ట్రలో గత కొద్ది రోజుల నుంచి మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంబై మహానగరం అల్లకల్లోలంలో పడింది. మహారాష్ట్రలోని ముంబై, పూణే, నాందేడ్ లలో కుండపోత వర్షం కురుస్తోంది. ఇక నాందేడ్ లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఏకంగా ఎనిమిది మంది మృతి చెందారు. ముంబై మహానగరంలోని పలు ప్రాంతాలలో రోడ్లన్నీ కాలువలను తలపిస్తున్నాయి. దీంతో రోడ్డుపైన వెళ్లే రహదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

కొన్ని ప్రాంతాలలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా సంభవిస్తుంది. ప్రజలు వారి ప్రాణాలను కాపాడుకోవడానికి అల్లాడిపోతున్నారు. చాలా చోట్ల కార్లు, ఇతర వాహనాలు నీటిలో మునిగిపోయాయి. అతి కష్టం మీద వాహనదారులు ముందుకు వెళ్తున్నారు. ఈ ఘటనపై సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమీక్ష నిర్వహించారు. రాబోయే 48 గంటలు కూడా విపరీతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని 48 గంటల పాటు ప్రజలు చాలా జాగ్రత్తగా వారి ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. అత్యవసర పరిస్థితులలో తప్పితే బయటకు రాకూడదని సూచనలు జారీ చేశారు.