ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. దీపావళి నుంచి దీపం పథకం..!

-

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దీపం పథకం ప్రారంభించనున్నట్టు తెలిపారు. దీపావళి పండుగ నుంచి దీపం పథకం ప్రారంభిస్తామని తెలిపారు. ప్రతీ కుటుంబానికి రెండు ఉచిత సిలిండర్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు సీఎం చంద్రబాబు.

మచిలీపట్నంలో స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో నేటి నుంచి చెత్త పన్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. గత ప్రభుత్వం విచ్ఛలవిడిగా చెత్త పన్ను వసూలు చేసిందని విమర్శించారు. తాను ఎంత చేసినా ప్రజలు అప్పుడప్పుడు నన్ను మర్చిపోతున్నారు. నన్ను మరిచిపోయినప్పుడు భూతం వస్తోంది.  ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే కార్యక్రమం చేపడుతామని తెలిపారు. ఎక్కడా చెత్త పన్ను వసూలు చేయవద్దని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. 2029 వరకు రాష్ట్రం స్వచ్ఛ ఏపీగా మారాలన్నారు. ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. పింగళి వెంకయ్య పేరు మీదుగా వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news