TTD : తిరుమల శ్రీవారిని దర్శించుకునే వారికి గుడ్ న్యూస్. తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది.తిరుమల శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకూండా నేరుగా తిరుమల శ్రీవారి దర్శనం జరుగుతోంది.
ఇక నిన్న తిరుమల శ్రీవారిని 56,950 మంది భక్తులు దర్శించుకున్నారు. అటు నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారికి 20,463 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అటు నిన్న ఒక్క రోజే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.75 కోట్లుగా నమోదు అయింది.
కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలికి ఐదు కోట్ల విలువైన విద్యుత్ గాలి మర విరాళంగా అందింది. ముంబై నగరానికి చెందిన ప్రవేట్ సంస్థ టిటిడి పాలక మండల కి ఐదు కోట్ల విలువైన విద్యుత్ గాలి మరణం విరాళంగా అందించింది. త్వరలోనే దీనిని టీటీడీ పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ విద్యుత్ గాలిమర ద్వారా ప్రతి సంవత్సరం 18 లక్షల యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. అంటే టీటీడీ పాలక మండలికి ప్రతి సంవత్సరం కోటి రూపాయల వరకు ఆదా అవుతుందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.