ఓటీటీలోకి ‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

-

రాఘవ లారెన్స్.. కొరియోగ్రాఫర్​గానే కాకుండా డైరెక్టర్, హీరోగా తన సత్తా చాటుతున్నాడు. లారెన్స్ తెలుగు ప్రేక్షకులకు చాలా పరిచయమైన ముఖం. స్టైల్, కాంచన, ముని, కాంచన-2 వంటి సినిమాల్లో నటించి.. డాన్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన లారెన్స్ తెలుగు ప్రేక్షకులను తన నటనతో, దర్శకత్వంలో ఫిదా చేశాడు. అవడానికి తమిళవాసి అయినా తెలుగు ఇండస్ట్రీలోనూ.. తెలుగు అభిమానుల మదిలో స్థానం సంపాదించుకున్నాడు. అందుకే తను ఏ సినిమా చేసినా రెండు భాషల్లో విడుదల చేసేలా జాగ్రత్తపడుతున్నాడు.

అలా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌’. ‘జిగర్‌ తండ’కు సీక్వెల్‌గా తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్​డ్ టాక్​ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడీ యాక్షన్‌ కామెడీ ఎంటర్​టైన్ర్ ఓటీటీలోనూ అలరించడానికి రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా డిసెంబర్‌ 8వ తేదీ నుంచి ప్రసారం కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుందట. ఇక ఇంగ్లీష్​లోనూ ఈ సినిమాను త్వరలోనే ప్రసారం చేస్తారట.

Read more RELATED
Recommended to you

Latest news