తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను మే 15న రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేనున్నారు. ఇందులో టైటాన్, క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, సొనాటా, టైమ్ వెల్, ఫాస్ట్ ట్రాక్ కంపెనీల వాచీలు ఉన్నాయి.
కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 18 లాట్లు ఈ-వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో కార్యాలయం పని వేళల్లో, టీటీడీ వెబ్సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.in ను సంప్రదించాలని టిటిడి సూచించింది.
కాగా, తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి…వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న 82,582 మంది భక్తులు…శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన 43,586 మంది భక్తులు కాగా…హుండీ ఆదాయం రూ. 3.19 కోట్లుగా నమోదు అయింది.