పోడు రైతులకు కేసీఆర్ శుభవార్త..పాలిగన్ టెక్నాలజీతో పోడు పట్టాలు

-

పోడు రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ‘పోడు’ భూముల పంపిణీ ఫైల్ పై సీఎం కేసీఆర్ సంతకంతో 4 లక్షల ఎకరాలకు పట్టాలు, 1,55,393 మందికి లబ్ధి చేకూరనున్నది. ఒకసారి పోడుపట్టాల పంపిన తర్వాత ఆటవి భూమి ఒక ఇంచుకూడా అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు పాలిగన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు.

భూమి సర్వే నెంబర్, పంపిణీ చేసే భూమి విస్తీర్ణం, ఆ భూమి ఏ అక్షాంశ, రేఖాంశాల మధ్య ఉన్నది? సంబంధిత భూమి హద్దులు ఏవి? వంటి అంశాలను గూగుల్ మ్యాపింగ్ వివరాలతో పాటు హోలోగ్రామ్ ను పోడు పట్టాలో పొందుపరచనున్నారు. పంపిణీ చేసిన తర్వాత భవిష్యత్తులో ఇరుగు పొరుగు వారితో భూహాద్దు వివాదాలు తలెత్తకుండా ఉండడం, లబ్ధిదారుడి భూమి పక్కనే అటవీ భూమి ఉంటే కాలక్రమమైన ఆ భూమిని లబ్ధిదారు ఆక్రమించుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ పాలిగన్ టెక్నాలజీని వినియోగించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version