ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూల్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు సర్కార్. 1450 కోట్లతో భారీ ప్లాన్ చేసింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ల్యాబ్లు అలాగే గ్రౌండ్స్ అభివృద్ధి చేస్తామని… తాజాగా ఏపీ సర్కార్ ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న స్కూళ్లలో.. 1450 కోట్లతో కంప్యూటర్ ల్యాబ్లు అలాగే గ్రౌండ్స్ అభివృద్ధి చేస్తామని గురుకుల స్కూల్ల కార్యదర్శి మస్తానయ్య ప్రకటన చేశారు.
2026 సంవత్సరం నాటికి 855 పాఠశాలలో ఆధునిక వసతులు కల్పిస్తామని కూడా వెల్లడించడం జరిగింది. చిత్తూరు జిల్లా కలికిరి పీలేరు గురుకులలో జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేయాలని ప్రభుత్వం కోరినట్లు కూడా ఆయన ప్రకటన చేశారు. గురుకులాల పరిధిలో… 50 స్కూళ్ళు.. పది జూనియర్ కాలేజీలు… ఒకే ఒక డిగ్రీ కాలేజీ ఉందని ఆయన ప్రకటన చేశారు.