ఉచిత వ్యవసాయ విద్యుత్తుపై మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్ సరఫరా కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని గొట్టిపాటి ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారానికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలని డిస్కంలకు ఆదేశాలు ఇచ్చారు.
లోడ్ సమస్యలు రాకుండా చూడాలని స్పష్టం చేసిన మంత్రి… వర్షాల వల్ల దెబ్బతిన్న విద్యుత్ స్థంబాలు, లూజుగా ఉన్న లైన్లు, ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ల విషయంలో రక్షణ చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు.
గిరిజన ప్రాంతాల్లో 100 శాతం విద్యుద్దీకరణ పూర్తి చేయాలని సూచనలు చేశారు. విద్యుత్ లైన్లు వేయలేని గిరిజన ప్రాంతాల్లో సొలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నట్టు తెలిపిన అధికారులు….2-3 నెలల్లో కొత్తగా 13 సబ్ స్టేషన్లు అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. ముఫ్త్ బిజిలి యోజన కింద రూఫ్ టాప్ సోలార్ విద్యుత్ ఫలకాల ఏర్పాటును ముమ్మరం చేస్తున్నామని వెల్లడించారు.