ఏపీలో రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్‌లు ఇవే

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ క్రమంగా పెరుగుతుంది. రోజు రోజుకి దీని తీవ్రత పెరుగుతుంది గాని ఎక్కడా కూడా తగ్గడం లేదు. పదుల సంఖ్యలో కరోనా కేసులు ప్రతీ రోజు నమోదు కావడంతో సిఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. లాక్ డౌన్ ని కూడా పోలీసులు చాలా కఠినం గా అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరిస్తుంది.

ఇక ఏపీలో కృష్ణా, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కరోనా తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ మూడు జిల్లాలు కూడా తెలంగాణా సరిహద్దు జిల్లాలే కావడం గమనార్హం. కరోనా కట్టడి లో చర్యలు తీసుకున్నా సరే ఈ మూడు జిల్లాల్లో భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఏపీ సర్కార్… రెడ్ జోన్ ఆరెంజ్ జోన్ గ్రీన్ జోన్ జిల్లాలను ప్రకటించింది. కరోనా తీవ్రత ఆధారంగా ఈ జిల్లాలను ప్రకటించింది.

రెడ్‌జోన్‌ జిల్లాలు: కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు ఆరెంజ్‌ జోన్‌ జిల్లాలు: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం, శ్రీకాకుళం, ప్రకాశం, విశాఖ, గ్రీన్‌జోన్ జిల్లా : విజయనగరం జిల్లా గా ప్రకటించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి అదుపులో ఉందని ప్రభుత్వం చెప్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news