తాజాగా ఒక సంఘటన చోటు చేసుకుంది. బిటెక్ విద్యార్థి గంజాయికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక పూర్తి వివరాలను చూస్తే.. నల్ల మల్లారెడ్డి కాలేజీ లో బిటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు విజయ్ కుమార్. అయితే, పోలీసుల కట్టడి కారణంగా గంజాయి లభించట్లేదు. దానితో మానసిక ఒత్తిడికి గురై విజయకుమార్ చావే మేలు అనుకున్నాడు. గంజాయి నుంచి మాన్పించేందుకు విజయ్ కుమార్ తల్లిద్రండ్రులు ఎంత గానో ప్రయత్నం చేసారు.
కానీ ఆ అలవాటు నుండి మాత్రం విజయ్ కుమార్ బయట కి రాలేక పోయాడు. ఇంటర్ నుంచి గంజాయికి అలవాటు పడ్డాడట. గంజాయి అలవాటై నుండి బయట కి రాలేక పోవడం, గంజాయి లేక ఉండలేక పోవడం.. ఇలా చెడు అలవాట్లకు గురై విజయకుమార్ రైలు కింద పడి ఆత్మ హత్య కు పాల్పడ్డాడు. చదువుకుంటానని చెప్తేనే ఇంజనీరింగ్ కాలేజీ లో చేర్పించామని, ఇలా జరుగుతుంది అని అస్సలు అనుకోలేదు అంటూ తల్లిదండ్రులు దుఃఖంలో మునిగి పోయారు.