ఆరోగ్యశ్రీ అమలులో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మానసిక ఆరోగ్య సమస్యలకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు ప్రైవేటు మానసిక ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ పథకంలో ఎంపానల్ మెంట్ చేయాలని యోచిస్తోంది.
ఇప్పటికే అన్ని ప్రభుత్వ, కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో మానసిక చికిత్సలకు ఆరోగ్యశ్రీ లో వైద్యం చేస్తున్నారు. ఇక అన్ని ప్రైవేటు వైద్య కళాశాలలో మానసిక చికిత్సలకు ఆరోగ్యశ్రీ అమలు అయ్యేలా చర్యలు తీసుకోనున్నారు.
కాగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్రెడ్డి ఈ ఆరోగ్యశ్రీ కార్డు విధానాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆరోగ్యశ్రీ కార్డు విధానం కొనసాగుతూనే ఉంది. ఈ విధానంలో కొన్ని మార్పులు చేసినప్పటికీ ఆ పేరుతోనే చాలా బ్రహ్మాండంగా సేవలు కొనసాగిస్తున్నాయి రెండు ప్రభుత్వాలు.