సంక్రాంతి మామూళ్ల కోసమే దత్తతండ్రి ఇంటికి దత్తపుత్రుడు వెళ్ళాడు – గుడివాడ అమర్నాథ్

-

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి కలిసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ భేటీ అనంతరం ఇద్దరూ మీడియా ముందుకి వచ్చిన చంద్రబాబు – పవన్ కళ్యాణ్ కుప్పంలో చంద్రబాబు కుప్పంలో జరిగిన సంఘటనలపై భేటీ అయ్యామని తెలిపారు.

వైసిపి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, చంద్రబాబు నాయుడుని కుప్పంలో తిరగనివ్వకపోవడం, ప్రతిపక్ష నేతల హక్కులని కాలరాయడం, ప్రజలను కలవనీయకుండా చేయడం ఇవన్నీ చూసి ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నామని ఇరువురు నేతలు తెలిపారు. అయితే వీరి భేటీ పై కీలక ఆరోపణలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. సంక్రాంతి మామూళ్ల కోసమే దత్తతండ్రి ఇంటికి దత్త పుత్రుడు వెళ్లాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వేసే ఎంగిలి మెతుకు సీట్లతో మ్యాజిక్ ఫిగర్ ఎలా చేరుకుంటారని ప్రశ్నించారు. అమాయకులైన జనసేన కార్యకర్తలను పవన్ కళ్యాణ్ అమ్మకానికి పెట్టాడని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version