పోయేకాలం వచ్చినట్టు ప్రవర్తించాడు రాజేంద్రప్రసాద్… సీనియర్ నటి పూజిత

-

టాలీవుడ్ లో సీనియర్ నటి పూజిత తాజాగా నటుడు రాజేంద్రప్రసాద్ పై విరుచుకుపడ్డారు తనతో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ అవసరం వచ్చినప్పుడు తను ఎవరో తెలియనట్టు ప్రవర్తించారు అంటూ చెప్పుకొచ్చారు..

సీనియర్ నటి పూజిత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు కానీ ఈమె దాదాపు 150 పైగా సినిమాల్లో నటించారు తెలుగులోనే 70 సినిమాలకు పైగా నటించగా ఇందులో ఎన్నో సినిమాలు నటుడు రాజేంద్రప్రసాద్ తో చేశారు.. ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ చిత్రంలో అతనికి రెండో భారీగా కనిపించి మంచి పేరు సంపాదించుకున్నారు ఆ తర్వాత సైతం పలు చిత్రాల్లో అతనితో నటించారు అయితే ఒక్కప్పుడు ఒక అవసరం వచ్చి అతని దగ్గరికి వెళ్లగా తను ఎవరో తెలియదు అన్నట్టు ప్రవర్తించారని చెప్పుకొచ్చారు..

తనకు అవసరం వచ్చి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు వెళ్లానని అయితే ఈ సమయంలో ప్రెసిడెంట్ గా ఉన్న రాజేంద్రప్రసాద్ తానెవరో తెలియదు అన్నట్టు ప్రవర్తించారంటూ చెప్పుకొచ్చారు అలాగే.. “నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ లెటర్ కోసం వెళ్లాను. మురళీమోహన్ గారు మా ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు నేను కూడా ఈసీ మెంబర్‌ గా పనిచేశాను. ఆ తరువాత రాజేంద్ర ప్రసాద్ వచ్చారు. అప్పుడు లెటర్ కోసం మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ కు వెళ్లినప్పుడు రాజేంద్రప్రసాద్ గారు నేను ఎవరో తెలియదు అన్నట్టుగా ప్రవర్తించారు. నాతో మాట్లాడితే తప్పు అన్నట్టుగా చూశారు.

ఆయన గతాన్ని మరిచి ప్రవర్తించారు. ఇద్దరం ఈసీ మెంబర్స్‌గా చేసిన వాళ్లమే కానీ ఆయన ప్రెసిడెంట్ అయ్యేసరికి ఈసీ మెంబర్‌ని చిన్న చూపు చూశారు. ఈసీ మెంబర్ అని గుర్తుంటే ఆయనకి నేను గుర్తు ఉండేదాన్ని. ప్రెసిడెంట్ అయిన తరువాత మేం ఎవరూ గుర్తులేమంటే ఆయనకి పోయే కాలం వచ్చినట్టు. ప్రెసిడెంట్ కానీ.. జనరల్ సెక్రటరీ కానీ.. అసలు నేను ఏం చెప్తున్నానో కూడా వినడానికి ఇష్టపడటం లేదు. నాకు అడుక్కోవడం ఇష్టం ఉండదు. సుమారు గంట పాటు వెయిట్ చేశాను.

కానీ వాళ్లు నేను ఇచ్చిన పేపర్‌ని కూడా చదవలేదు. అప్పుడు నేను ఒక నవ్వు నవ్వుకుని వచ్చేశాను. నేను ఓట్లు వేస్తే గెలిచిన వాడు.. ఆ రోజు నన్ను హేళన చేయడం నచ్చలేదు. రాజేంద్రప్రసాద్ పక్కన హీరోయిన్‌గా కూడా చేశా.. అయినా ఆయన సపోర్ట్ చేయలేదు.. శివాజీ రాజా జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. వీళ్లిద్దరూ హెల్ప్ చేయలేదు… ” అంటూ చెప్పుకొచ్చింది నటి పూజిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version