గుడివాడలో సీఎం చంద్రబాబే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారన్నారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. గుడివాడ రామ బ్రహ్మం పార్కులో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు కలెక్టర్ బాలాజీ, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఏర్పాట్లపై అధికారులకు వివిధ సూచనలు చేశారు కలెక్టర్ బాలాజీ, ఎమ్మెల్యే రాము. ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ… గుడివాడ ప్రత్యేకతను చాటి చెప్పేలా సీఎం చంద్రబాబుకు స్వాగతం చెబుతామన్నారు.
ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో…. అన్నా క్యాంటీన్ పథకం గుడివాడలో పునర్ ప్రారంభం కావడం సంతోషకరమని తెలిపారు. విశేష ప్రజాదరణ పొంది…. లక్షలాదిమంది పేదల కడుపు నింపిన అన్నా క్యాంటీన్ పథకాన్ని తొలగించడం గత ప్రభుత్వ దుర్మార్గాల్లో ఒకటి అన్నారు. అన్న ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తే…. సీఎం చంద్రబాబు ఐదు రూపాయలకు చక్కటి భోజనం అందిస్తున్నారు….అన్నా క్యాంటీన్ పథకాన్ని గుడివాడలో పునర్ ప్రారంభిస్తున్నందుకు సీఎంకు ధన్యవాదాలు చెప్పారు.