తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల

-

రాష్ట్రంలో రాజ్యసభ ఉప ఎన్నికకు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో  బీఆర్‌ఎస్‌ సభ్యుడు కే కేశవరావు రాజీనామాతో  ఖాళీ ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీకి, రాజ్యసభ సబ్యుడి పదవీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు కే కేశవరావు. తాజాగా నోటిఫికేషన్ విడుదల కావడంతో..  నేటి  నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఆగస్టు 27న ప్రకటిస్తారు.

ఒకవేళ ఎన్నిక అవసరమైతే.. సెప్టెంబర్‌ 3న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనున్నది. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. ఇక ఈ స్థానానికి ఎన్నికయ్యే వారు 2026 ఏప్రిల్‌ 9 వరకు కొనసాగనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్‌ పేర్కొన్నది. మరీ కేశవరావు రాజీనామాతో ఏర్పడిన ఖాళీని ఎవ్వరూ నియామకం అవుతారో వేచి చూడాలి మరీ.

Read more RELATED
Recommended to you

Latest news