కృష్ణాజిల్లా గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కేసు చంద్రబాబు సర్కార్ కు తలనొప్పిగా మారింది. కృష్ణాజిల్లా గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో హిడెన్ కెమెరాల కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగడం జరిగింది. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు సహచర హాస్టల్ విద్యార్థులు.
ఈ విషయం తెలుసుకొని కాలేజీ హాస్టల్ కు చేరుకున్న పోలీసులు…విచారణ చేస్తున్నారు. జూనియర్, సీనియర్ విద్యార్థులను అదుపు చేస్తూ.. ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్‌ను ప్రశ్నిస్తున్నారు గుడివాడ పోలీసులు. విద్యార్థి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు…300 వీడియోలు గుర్తించారట. వాస్తవంగా 300 పైగా బాత్రూం వీడియోలు తీయించిన విజయ్ అనే నిందితుడు కాగా… కెమెరాలు పెట్టి వీడియోలు తీయడంలో విజయ్ ప్రియురాలు అతనికి సహకరించింది అని ఆరోపిస్తున్నారు విద్యార్థినులు.