నాకు మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబుకు రుణపడి ఉంటా – మంత్రి సంధ్యారాణి

-

నాకు మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబుకు రుణపడి ఉంటానని తెలిపారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి. పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఇంటి వద్ద పత్రికా సమావేశంలో మాట్లాడుతూ…. గిరిజనులకు సేవ చేయాలని మంచి ఉద్దేశంతో రాజకీయాల్లో రావడం జరిగింది..మారుమూల గిరిజన గ్రామాల్లో ఎన్నికలకు ప్రచారం కు వెళ్లే సమయంలో మంచినీటి సమస్యలతో నా గిరిజనులు చాలా ఇబ్బందులు పడడం చూశాను.

Gummadi Sandhya Rani

గర్భిణీలు డోలీలు మోతపై వెళ్లడం చూశానన్నారు. గత ప్రభుత్వం సమయములో డోలి కష్టాలతో గిరిజన మహిళలు నడిరోడ్డు మీద బిడ్డకు జన్మనిస్తుంటే చాలా బాధపడిన రోజులు ఉన్నాయి…ఇకపై మా ప్రభుత్వం వచ్చింది కదా ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో విద్యా వైద్యం సాగునీరు తాగునీరు రోడ్లపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. నేను ఎవరిపై కక్ష సాధింపు చర్యలు చెయ్యను…అది మా పార్టీ అభిమతం కాదు…మా సీఎం గారు చెప్పేటట్టు తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడాలని డిమాండ్‌ చేశారు. మేము వేరే పార్టీ కార్యకర్తలపై కక్ష సాధించామన్నారు. నాకు రెండు మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు నాయుడుకి జన్మంతా రుణపడి ఉంటా….చంద్రబాబు నాయుడు ఆశయాలతో లోకేష్ బాబు అడుగుజాడలు అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తానని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news