గుంటూరు కలెక్టర్ మీద డాక్టర్ సీరియస్.. అరెస్ట్ చేయాలంటూ ఆదేశాలు !

గుంటూరు జిల్లాలో కలెక్టర్ మీద ఫైర్ అయిన ఒక వైద్యాధికారి ఇప్పుడు ఉద్యోగం పోగొట్టుకుని జైలు పాలు అయ్యాడు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఈరోజు నరసరావుపేటలో కరోనా పరిస్థితుల మీద సమీక్ష నిర్వహించారు. అయితే అక్కడి వైద్య సిబ్బంది పనితీరు పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే కలెక్టర్ తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేసిన నాదెండ్ల మండల వైద్యాదికారి సోమ్లూ నాయక్, క్షేత్ర స్దాయిలో కష్టపడే తమను ఇలా మాట్లాడటం సరికాదని కాస్త గట్టిగానే స్పందించారు.

అయితే సమావేశంలో అంత మంది ఉండగానే వైద్యాధికారి ఎదురు చెప్పడం పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. తనకే ఎదురు చెబుతావా అంటూ మండిపడ్డారు. అంతే కాదు వెంటనే అరెస్టు చేయాలంటూ డిఎస్పీని కూడా కలెక్టర్ ఆదేశించారు. అలానే ఆయన్ని వెంటనే సస్పెండ్ చేయాలని జిల్లా వైద్య శాఖ అధికారికి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే కలెక్టర్ తీరు పై వైద్య వర్గాలు ఖంగుతిన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం ఎండాకా వెళ్తుందో చూడాలి మరి.