జనసేనకు 24 సీట్లు ఇవ్వడంపై హరిరామ జగయ్య ఫైర్‌

-

జనసేనకు 24 సీట్లు ఇవ్వడంపై మాజీ మంత్రి హరిరామ జగయ్య ఫైర్‌ అయ్యారు. ఒకరు ఇవ్వడం మరొకరు దేహీ అనడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా.. జనసేన 24సీట్లకు మించి నెగ్గగలిగే స్తోమత లేదా..అంటూ నిలదీశారు. జనంలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా..ఈ పంపకం కూడా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ చెప్పగలరా.. అంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరిరామ జగయ్య.

Harirama Jogaiah’s letter on TDP janasena alliance

ఓట్ల సంక్షోభానికి ఏది తెర అంటూ ఈ మేరకు లేఖ విడుదల చేశారు. సీట్ల పంపకం మిత్ర పక్షాల మధ్య ఏ ప్రాతిపదికన చేసారు..అన్నికులాల జనాభా ప్రాతిపధికన జరిగాయా అని నిలదీశారు. జనసైనికులు సంతృప్తి చెందే విధంగా సీట్లు పంపకం ఉందా..అని మండిపడ్డారు. జనసైనికులకు కావాల్సింది ఎమ్మెల్యే సీట్లు కాదు….పవన్ పరిపాలన అధికారం చేపట్టడమని తెలిపారు. పొత్తు ధర్మంలో భాగంగా రెండు ఏళ్లు ముఖ్యమంత్రి పదవి చేయడమని….చెరిసగం మంత్రి పదవులు దక్కాలని డిమాండ్‌ చేశారు. ఈ రకంగా ప్రకటన విడుదలయితేనే వైసీపీ ఓడుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news