బీఆర్‌ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్ తీగల అనిత రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఈ నెల 27 న జరిగే చేవెళ్లలో జరిగే సభలో ప్రియాంక గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి ఆమె భర్త ట్రేడ్ యూనియన్ నాయకులు శోభన్ రెడ్డి లు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.

ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీలత రెడ్డి చేరారు. కాగా బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత లేదంటూ జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతుల రాజీనామా చేశారు. ఈ మేరకు నిన్న కేసీఆర్ కు లేఖ పంపారు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు.