వైసీపీ పార్టీ తోనే మ‌హిళా సాధికార‌త‌ – మంత్రి విడదల రజినీ

-

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వంతోనే మ‌హిళా సాధికార‌త సాధ్య‌మ‌వుతుంద‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని చెప్పారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళలకు మేలు జరిగే విధంగా రూపకల్పన చేశార‌ని తెలిపారు. మహిళలు బాగుంటేనే వారి ఇల్లు బాగుంటుందని, తద్వారా సమాజం, రాష్ట్రం బాగుంటుందని నమ్మి త‌మ ప్ర‌భుత్వం సంక్షేమ పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలను నేరుగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న‌ద‌ని వివ‌రించారు.

Health Minister Vidadala Rajini 

రూ.51 వేల కోట్లతో 32 లక్షల మందికి పైగా మ‌హిళా ల‌బ్ధిదారుల‌కు ఒకేసారి ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం చేసిన ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ గారు మాత్ర‌మే అని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేకుండా, ఎవ‌రి సిఫారుసుల‌తో సంబంధం లేకుండా ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను జ‌గ‌న‌న్న అంద‌జేస్తున్నార‌ని చెప్పారు. గతంలో టిడ్కో ఇళ్ళ నిర్మాణం పేరుతో లబ్ధి దారుల దగ్గర నుంచి స్థానిక టీడీపీ నేతలు ఏ స్థాయిలో క‌మిష‌న్లు గుంజారో చూశామ‌ని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని ధ్వ‌జ‌మెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news