ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన మంచి మనసు చాటుకున్నారు. ఓ వ్యక్తి ప్రాణం నిలిపేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ చూపారు. గుంటూరులో ప్రమాదవశాత్తూ బ్రెయిన్ డెడ్ అయిన 18 ఏళ్ల కట్టా కృష్ణ అనే యువకుడి అవయవాలు దానం చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు.

అతని గుండె మార్పిడి చేసి తిరుపతికి చెందిన 33 ఏళ్ల వ్యక్తిని బతికించేందుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏకంగా హెలీకాప్టర్ ద్వారా గుండె తరలించారు అధికారులు. దీంతో గుంటూరు నుంచి తిరుపతికి చేరింది గుండె. ఇక తిరుపతిలో గుండె మార్పిడి అవసరమైన వ్యక్తి కోసం గుంటూరు నుండి ఏకంగా ప్రత్యేక హెలీకాప్టర్ ద్వారా గుండె తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ తరుణంలోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ప్రశంశల జల్లు కురుస్తోంది.