స్కూల్ అసిస్టెంట్ టీచర్ల బదిలీలపై మరో అడుగు పడింది. స్కూల్ అసిస్టెంట్ టీచర్ల బదిలీల ప్రక్రియ మొదలైంది. ఈ నెల 28, 29 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చేందుకు అధికారులు అనుమతించారు. మల్టీజోన్-2 పరిధిలో కోర్టు స్టే కారణంగా స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు బదిలీలు చేపట్టడం లేదని, 33 జిల్లాల్లో ప్రభుత్వ టీచర్లకు మాత్రం బదిలీలు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.
ఇది ఇలా ఉండగా, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం పది గంటల నుంచి వెబ్ సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉంటాయని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. ఈనెల 15న 1139 కేంద్రాల్లో జరిగిన టెట్ పేపర్ వన్ కు 2 లక్షల 26 వేల 744 మంది.. పేపర్ టూ లక్ష 89 వేల 963 మంది రాశారు. జాతీయ ఉపాధ్యాయ విద్య మండలి నిబంధనల ప్రకారం, విద్యా హక్కు చట్టం ప్రకారం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు బోధించాలంటే తప్పనిసరిగా టెట్ లో అర్హత సాధించాలి.