ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడి…రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఇవాళ కృష్ణ, పల్నాడు, NTR, GNT, ప్రకాశం, NLR, బాపట్ల జిల్లాల్లో కొన్నిచోట్ల… రేపు అల్లూరి, ELR, కృష్ణా, NTR జిల్లాలో అతి బారి వర్షాలు పడతాయని హెచ్చరించింది.
మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడతాయని పేర్కొంది. ఈదురు గాలులతో పాటు పలుచోట్ల పిడుగులు పడతాయని హెచ్చరించింది. కాగా, ఏపీకి మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఐఎండి అంచనా ప్రకారం పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర -దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది.