బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ఏర్పడినట్లు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన చేసింది. దీని ప్రభావంతో మంగళవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వివరించింది.

Heavy to very heavy rains in AP

ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 16వ తేదీ నాటికి వాయుగుండం గా బలపడనుందని తెలిపారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందన్నారు. దీనివల్ల ఇవాళ రేపు…దక్షిణ కోస్తా, రాయలసీమలోని ఒకటి మరియు రెండు ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఇవాళ నెల్లూరు, తిరుపతి,చిత్తూరు, అన్నమయ్య జిల్లాలలో భారీ వర్షాలు తెలిపింది అమరావతి వాతావరణ శాఖ.

Read more RELATED
Recommended to you

Latest news