ఆధ్యాత్మమైన ప్రాంతంగా ఎంతో పేరుగాంచిన తిరుపతిని కొంతమంది తమ అక్రమ సంపాదన కోసం తప్పుడు పనులు చేస్తున్నారు. ఎవ్వరికి అనుమానం రాకుండా ఉండటానికి ఖరీదైన అపార్టుమెంట్ లను అడ్డగా చేసుకొని గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారు. ఇటీవల తిరుపతిలోని ఒక ప్రాంతంలో ముగ్గురు విటులతో పాటు నిర్వాహకులు, అమ్మాయిలు పట్టుబడ్డారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నెట్ సాయంతో కొన్ని ఆన్ లైన్ వెబ్ సైట్ ల ద్వారా అమ్మాయిలను ఎరగా వేస్తూ విటులను రప్పిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల నుండి ఇంకా తమిళనాడు నుండి యువతులను నయానో ..భయానో రప్పించి వ్యభిచారం రొంపి లోకి దింపి వారి ద్వారా యథేచ్ఛగా సంపాదిస్తున్నారు.
ఆన్ లైన్ లో అమ్మాయిల ఫొటోలతో వెబ్‌సైట్స్ ఉన్నాయి. వాటిని చూసి ఫోన్ ద్వారా సంప్రదించిన వారికి యువతుల ఫొటోలు, మొత్తం, బ్యాంక్ ఖాతా నంబర్ పంపిస్తారు. డబ్బు ఖాతాలోకి రాగానే ఎంపిక చేసుకున్న లాడ్జీలకు రమ్మని విటులకు చెబుతున్నారు. అలా కాదనుకుంటే ఆ యువతలను వారు చెప్పిన చోటికి వారి సిబ్బంది ద్వారా పంపిస్తున్నారు. అదేవిధంగా లాడ్జీలో గదులు తీసుకున్న వారు అమ్మాయిలను కావాలని అడిగితే నిర్వాహకులతో లావాదేవీలు జరిపి సరఫరా చేస్తున్నారు.
ముఖ్యంగా బ్రోకర్లు యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపు లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో అందమైన యువతులు, మహిళల ఫొటోలను పోస్టు చేస్తున్నారు. నచ్చిన వారు సంప్రదించాలంటూ కాంటాక్ట్ నంబర్‌ను సైతం పెడుతున్నారు. గంటకు రూ.1000 నుంచి రూ.5,000లు, యువతులను ఒక్కరోజు తీసుకువెళితే రూ.10 వేల నుంచి రూ. 30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
ఆన్‌లైన్‌లో విటులను ఆకర్షించి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాలపై నిఘా పెట్టినట్లు తిరుపతి పోలీసులు తెలిపారు. త్వరలోనే వీరిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఎలాంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని. వ్యభిచారాన్ని కూకటి వేళ్లతో నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.