టీటీడీ బోర్డు సభ్యుల నియామకంపై హైకోర్టులో విచారణ

-

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యులుగా అనర్హులను నియమించారని దాకలైన పిటిషన్‌ను బుధవారం హైకోర్టు విచారణ జరిగింది.  బోర్డు సభ్యులుగా కేతన్ దేశాయ్, సామినేని ఉదయభాను, శరత్ చంద్రారెడ్డి నియమకాలను సవాల్ చేస్తూ జైభీమ్ యాక్సెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసింది.  పలు కేసులు ఉన్న వ్యక్తులను టీటీడీ బోర్డులో నియమించడం నిబంధనలకు విరుద్ధమని ఆ పిటిషన్‌లో పేర్కొంది. ఆ ముగ్గురికి నేర చరిత్ర ఉందని, వారిని బోర్డులో సభ్యులుగా నియమించేందుకు వీలు లేదని పేర్కొంటూ పిటిషన్ దాఖలైంది.

పిటీషన్ తరఫున హైకోర్టు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ నియమకాలు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం నియామకాలు చేపట్టకూడదు. తాత్కాలిక బెయిల్ పై ఉన్న వ్యక్తి నియామకం చట్టవిరుద్ధం అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు స్పందిస్తూ.. సభ్యుల నియామకంపై పూర్తి వివరాలు దాఖలు చేయాలని దేవాదాయ కమిషనర్, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 

Read more RELATED
Recommended to you

Latest news